X
A Singapore Government Agency Website
AA
A
A

నెల్లూరు

నెల్లూరు

సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ కాంప్లెక్స్: ఎదుగుతున్న భారతదేశానికి అత్యావశ్యకమైన పవర్‌ని అందిస్తోంది

 

APO Nellore

సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ కాంప్లెక్స్: ఎదుగుతున్న భారతదేశానికి అత్యావశ్యకమైన పవర్‌ని అందిస్తోంది.

భారీ యుటిలిటీ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి, స్వంతం చేసుకోవడం మరియు నిర్వహణలో బలమైన ట్రాక్ రికార్డ్ కలిగిన కంపెనీ వలే, సెంబ్‌కార్ప్ 2010లో భారతీయ ఎనర్జీ మార్కెట్‌లో ప్రవేశించింది. దేశంలో ఆపరేషన్ మరియు అభివృద్ధిలో సుమారు 4000 మెగావాట్‌ల థర్మల్ మరియు రెన్యువబుల్ అసెట్‌ల పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంది. బలమైన ఎదుగుదల ఉనికితో, ఇటీవల కాలంలో భారతదేశంలో పవర్ సెక్టార్‌లో అతి పెద్ద విదేశీ పెట్టుబడుదారుల్లో ఒకరిగా నిలుస్తోంది..

సెంబ్‌కార్ప్ ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలోని $3 విలువ చేసే సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ కాంప్లెక్స్‌ని అభివృద్ధి , ఆపరేట్ చేయడంతోపాటుగా నిర్వహిస్తోంది. రెండు పవర్ ప్లాంట్‌లు – ద ధర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా (TPCIL) మరియు సెంబ్‌కార్ప్ గాయత్రీ పవర్ (గతంలో NCC పవర్ ప్రాజెక్ట్‌లు)కలిగిన 660 మెగావాట్ సూపర్ క్రిటికల్ కోల్ ఫైర్డ్ యూనిట్‌లు కలిగిన పవర్ కాంప్లెక్స్ 2,640 మెగావాట్‌ల పవర్ సామర్ధ్యంతో, ఆంధ్రప్రదేశ్ రోజువారీ ఇంధన డిమాండ్‌లో 40% అందిస్తోంది.

రెండు పవర్ ప్లాంట్‌లు సమీపంలో ఉండటం వల్ల, ఒకే బొగ్గు దిగుమతి, లాజిస్టిక్ మౌలిక సదుపాయం మరియు మేనేజ్‌మెంట్ వంటివాటిని ఉమ్మడిగా ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధిని పొందేందుకు సెంబ్‌కార్ప్‌కు అవకాశం లభించింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు సూపర్ క్రిటకల్ టెక్నాలజీ వంటి సాంకేతికతను మరియు సృజనాత్మకతను ఉపయోగించుకోవడం ద్వారా, సంప్రదాయ కోల్డ్ ఫైర్డ్ పవర్ ప్లాంట్‌ల కంటే మేం అధిక సమర్ధత మరియు తక్కువ ఉద్గారాలను సాధించగలిగాం. తీరం నుంచి పవర్ కాంప్లెక్స్ వరకు బొగ్గును నిరంతరాయం రవాణా చేయడానికి కవర్డ్ కన్వేయర్ సిస్టమ్ ద్వారా గాలి కాలుష్యం అదేవిధంగా రైలు నెట్‌వర్క్‌పై లోడ్‌ని తగ్గించాం.

సెంబ్‌కార్ప్ తన స్వంత సబ్సిడరీ సెంబ్‌కార్ప్ యుటిలిటీస్ ద్వారా TPCIL 86.9% వాటాని కలిగి ఉంది, గాయత్రి ప్రాజెక్ట్స్ స్వంత సబ్సిడరీ అయిన గాయత్రి ఎనర్జీ వెంచర్స్ మిగిలిన 13.1% వాటాను కలిగి ఉంది.

సెంబ్‌కార్ప్ సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ ప్లాంట్‌లో 88% వాటాని కలిగి ఉంది, మిగిలిన వాటా NCC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ద్వారా గాయత్రి ఎనర్జీ వెంచర్స్ ద్వారా కలిగి ఉంది.

మూలం:http://www.sembcorp.com/en/media/features?Id=9170

add HOME ABOUT US IMPROVING TRADE TRANSFORMING INDUSTRIES NEWSROOM RESOURCES LEGISLATION CAREERS
Amaravati Partnership Office
మా గురించి
జట్టు
అభివృద్ధి
కథలు
అవకాశాలు
సంప్రదించండి
Contact Us Feedback FAQs