X
A Singapore Government Agency Website
AA
A
A

సింగపూర్ మరియు భారతదేశం

దక్షిణ భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన చోళుల కాలం నుంచి సింగపూర్‌ మరియు భారతదేశానికి మధ్య సంబంధాలున్నాయి. సింగపూర్ బ్రిటిష్ వలసరాజ్యంగా ఉన్నప్పుడు 1830 నుంచి 1867 వరకు కోల్‌కతా కేంద్రంగా పరిపాలించబడింది, నేడు ఈ రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య, సాంస్కృతిక మరియు ప్రజల మధ్య బలమైన సంబంధాలున్నాయి. రెండు దేశాల ప్రధాన మంత్రుల ద్వారా నవంబర్ 2015లో సంతకం చేయబడ్డ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు, మరిముఖ్యంగా వాణిజ్య మరియు ఆర్ధికాభివృద్ధి ప్రాంతాల్లో మరింత బలోపేతం కావడం కొనసాగింది.

2014లో భారతదేశంలో జరిగిన ఎన్నికలు, మరిముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సింగపూర్ పాత్రను పెంచేందుకు అవకాశాల గవాక్షం తెరవబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “100 స్మార్ట్ నగరాలు” పథకాన్ని దృష్టిలో పెట్టుకొని, సింగపూర్, ‘‘అమరావతి: ప్రజల రాజధాని’’ అని పిలవబడుతున్నఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగర రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది

సింగపూర్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి పెద్ద పెట్టుబడి గమ్యస్థానంగా మారింది. 2014 విభజనకు ముందు, పాత ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధిపరంగా అత్యధిక ర్యాంక్ కలిగిన భారతీయ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగపూర్, పవర్ మరియు ఆఫ్‌షోర్ మెరైన్ రంగాల్లో గణనీయంగా S$500 పెట్టుబడిని పెట్టింది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ఆర్ధికాభివృద్ధి అవకాశాలున్నాయి: ఉదా. సుమారు 900 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం; వివిధ రకాల ఖనిజ వనరులు ( సహజవాయువు వనరులతో సహా); మరియు విశాఖపట్నంలో ప్రధానమైన పోర్ట్ ఉంది. మంచి రైల్ రోడ్డు నెట్‌వర్క్‌లు, పెరుగుతున్న హైవేల నెట్‌వర్క్‌తోపాటుగా, ఆగ్నేయాసియా మరియు తూర్పు ఆసియాకు అభిముఖంగా బంగాళాఖాతం ఉండటం ద్వారా ఎగుమతులు మరియు దిగుమతులకు ముఖద్వారంగా ఉంది.

15 MAY 2017
08 MAY 2017
21 FEB 2017
03 JAN 2017
19 SEP 2016
18 JUL 2016
04 JUL 2016
12 MAR 2016
30 OCT 2015
22 OCT 2015
20 JUL 2015
25 MAY 2015
07 MAY 2015
30 MAR 2015
04 FEB 2015
08 DEC 2014
01 DEC 2014
15 MAY 2014
01 MAR 2014
chevron_left chevron_right

లెటర్ ఆఫ్ అవార్డ్ మరియు G-టూ-G ఎమ్‌వోయూ

సింగపూర్ కన్సారియం ADCLతో అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్‌ని రూపొందిస్తుంది, ఇది సార్టప్ ప్రాంతపు స్టార్టప్ డెవలపర్, సింగపూర్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు G-టూ-G ఎమ్‌వోయుని కుదుర్చుకున్నాయి, దీనిలో భాగంగా ఉమ్మడి అమలు స్టీరింగ్ కమిటీ మరియు ఉమ్మడి అమలు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాయి
APO Logo

GOAP ప్రభుత్వ ఆర్డర్‌ని రిలీజ్ చేసింది

మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ కన్సారియంని ఎంచుకోవడానికి ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది
SWISS CHALLENGE

స్విస్ ఛాలెంజ్ దశ 1 ముగింపు

స్విస్ ఛాలెంజ్ దశ 1 ముగిసేనాటికి ఎలాంటి చట్టబద్ధమైన బిడ్‌లు రాలేదు
SWISS CHALLENGE

స్విచ్ ఛాలెంజ్ తాజా నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది
High Court logo

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది

కోర్టు హియరింగ్ తరువాత, ఆంధ్రప్రదేశ్ స్విస్ ఛాలెంజ్ కొరకు తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించుకుంది
SWISS CHALLENGE

GOAP స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనను పబ్లిష్ చేసింది

45 రోజుల ఓపెన్ ఛాలెంజ్ పీరియడ్ మొదలైంది
GOAP Logo

GOAP ప్రభుత్వ ఆర్డర్‌ని రిలీజ్ చేసింది

స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదనను మరియు దాని పబ్లిష్ చేయడానికి అధికారం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.వో.ని విడుదల చేసింది
SWISS CHALLENGE

సవరించబడ్డ స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదన సబ్మిట్ చేయబడింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనను 2015 నవంబర్ నుంచి సమీక్షించింది, సింగపూర్ కన్సారియం స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదనను సబ్మిట్ చేసింది
SWISS CHALLENGE

స్విచ్ ఛాలెంజ్ ప్రతిపాదన (SCP) సబ్మిట్ చేయబడింది

సింగపూర్ కన్సారియం (అసెండస్- సింగ్‌బ్రిడ్జ్ ప్రయివేట్ లిమిటెడ్ మరియు సెంబ్‌కార్ప్ డెవలప్‌మెంట్ లిమిటెడ్)లు స్టార్టప్ ప్రాంత మాస్టర్ డెవలప్‌మెంట్‌ని ప్రతిపాదించాయి
APO Image

అమరావతి నిర్మాణానికి పునాదిరాయి వేయబడింది

లింగాయపాలెం వద్ద జరిగిన శంకుస్థాపక కార్యక్రమాల్లో భారత ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ మరియు మంత్రి ఎస్. ఈశ్వరన్,సింగపూర్ తరఫున హాజరయ్యారు
Seed Capital Plan for APO

సీడ్ క్యాపిటల్ ప్రాంత మాస్టర్ ప్లాన్ హ్యాండోవర్ చేయబడింది

సింగపూర్ ప్రభుత్వం మొత్తం మూడు మాస్టర్ ప్లాన్‌ల్లో మూడోదానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది
New Capital for AP

క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ హ్యాండోవర్ చేయబడింది

సింగపూర్ ప్రభుత్వం మొత్తం మూడు మాస్టర్ ప్లాన్‌ల్లో రెండోదానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది
APO logo

GOAP ప్రభుత్వ ఆర్డర్‌ని రిలీజ్ చేసింది

సీడ్ క్యాపిటల్ ప్రాంత మాస్టర్ డెవలపర్‌‌ని ఎంచుకోవడానికి స్విస్ ఛాలెంజ్ విధానం స్వీకరించబడింది
New Capital for AP

క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ హ్యాండోవర్ చేయబడింది

సింగపూర్ ప్రభుత్వం మొత్తం మూడు మాస్టర్ ప్లాన్‌ల్లో మొదటిదానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది
APO logo

‘ప్రజల రాజధాని’ అనే ట్యాగ్‌లైన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వ అధికారుల మధ్య విజనింగ్ కసరత్తు

GOS మరియు GOAP మధ్య MOU సంతకం చేయబడింది

కొత్త రాజధాని నగరం మరియుు ప్రాంతం కొరకు మాస్టర్‌ ప్లాన్‌లను తయారు చేయడం
Surbana Jurong Logo

సుర్బానా జురోంగ్ ప్రయివేట్ లిమిటెడ్ నియమించబడింది

మూడు మాస్టర్ ప్లాన్‌లు అభివృద్ధి చేయబడతాయి
Indian PM photo

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “100 స్మార్ట్ నగరాలు"

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “100 స్మార్ట్ నగరాలు"
AP Reorganisation

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదించబడింది

10 సంవత్సరాల్లోపు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి
కొత్త రాజధాని కొరకు నిపుణుల కమిటీ 6 నెలల్లోపు సిఫారసులు చేస్తుంది

నిమగ్నం కావడం

వ్యాపారం లేదా విశ్రాంతి కొరకు భారతదేశం సందర్శించాలని భావించిన వారందరికి కూడా అమరావతి మొదటి గమ్యస్థానంగా నిలుస్తుంది. సహకార అవకాశాల ప్రపంచంలోనికి ప్రవేశించండి మరియు పశ్చమానికి సాగించే మా కొత్త ప్రయాణంలో చేరండి, ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ప్రజల సరికొత్త మార్పును చూడండి. సింగపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, అలానే భారతీయ మరియు తెలుగు వారికి ప్రత్యేకమైన ఫీచర్‌లో ప్రజల రాజధాని ఒక ఉత్సాహవంతమైన మరియు అత్యంత జీవనశైలి కలిగిన నగరంగా ఆవిర్భవించనుంది. సింగపూర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీల భాగస్వామ్యం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక అనుభవం మరియు స్థిరమైన జీవనోపాధికి విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకోనున్నాయి. ఆశ్చర్యపడకండి! ప్రపంచ స్థాయి, జీవనాధారమైన మరియు స్థిరమైన ధారణీయ నగర రూపకల్పనలో భాగమయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోండి!

add HOME ABOUT US IMPROVING TRADE TRANSFORMING INDUSTRIES NEWSROOM RESOURCES LEGISLATION CAREERS
Amaravati Partnership Office
మా గురించి
జట్టు
అభివృద్ధి
కథలు
అవకాశాలు
సంప్రదించండి
Contact Us Feedback FAQs